April 25, 2026
Explore
పంచాయతీల అభివృద్ధికి ప్రజల సహకారం అవసరం: డీఎల్పీఓ మస్తాన్ వలి

పంచాయతీల అభివృద్ధికి ప్రజల సహకారం అవసరం: డీఎల్పీఓ మస్తాన్ వలి

April 25, 2026 | Andhra Pradesh

సుండుపల్లి ముచ్చట్లు:

సుండుపల్లి మండలంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎల్పీఓ మస్తాన్ వలి మాట్లాడుతూ గ్రామ పంచాయతీల అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం అత్యవసరమని తెలిపారు.

పంచాయతీ కార్యాలయంలో జరిగిన గ్రామసభలో మహాత్మా గాంధీ చిత్రపటానికి నివాళులు అర్పించారు. గ్రామసభల ద్వారా మౌలిక వసతుల అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు రూపొందించి సమస్యలను పరిష్కరించవచ్చన్నారు.

సర్పంచుల పదవీకాలం ముగిసినందున ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోందని, ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.

Tags: Public Cooperation is Essential for the Development of Panchayats: DLPO Mastan Vali