April 25, 2026
Explore
ఇసుక రీచ్ రద్దు చేయాలంటూ నిరసనకు అనుమతి కోరిన రైతులు

ఇసుక రీచ్ రద్దు చేయాలంటూ నిరసనకు అనుమతి కోరిన రైతులు

April 25, 2026 | Andhra Pradesh

సుండుపల్లి ముచ్చట్లు:

సుండుపల్లి మండలం వైన్‌పాలెం బహుదానదిలో ఇసుక క్వారీలో అక్రమ తవ్వకాలపై నిరసన తెలియజేయడానికి అనుమతి ఇవ్వాలని స్థానిక రైతులు, కూటమి నాయకులు తహసీల్దార్ లక్ష్మమ్మ, ఎస్‌ఐ హుస్సేన్‌లకు వినతిపత్రం సమర్పించారు.

నిబంధనల ప్రకారం 1.79 హెక్టార్లలో ఒక మీటర్ లోతులో మాన్యువల్‌గా ఇసుక తవ్వకాలు చేయాల్సి ఉండగా, భారీ యంత్రాలతో సుమారు 50 హెక్టార్లలో 8 నుంచి 10 మీటర్ల లోతు వరకు తవ్వకాలు జరిపినట్లు ఆరోపించారు.

అధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోలేదని, వందలాది టిప్పర్లలో ఇసుక తరలిస్తున్నారని పేర్కొన్నారు. దీంతో తాగునీరు, సాగునీటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సుండుపల్లి కూడలిలో నిరసన చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.

Tags: Farmers Seek Permission to Protest Demanding Cancellation of Sand Reach