April 25, 2026
Explore
రాయచోటిలో పోలీస్ ఫ్లాగ్ మార్చ్

రాయచోటిలో పోలీస్ ఫ్లాగ్ మార్చ్

April 25, 2026 | Andhra Pradesh

రాయచోటి ముచ్చట్లు:

రాయచోటి పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ట్రాఫిక్ అమలు కోసం అర్బన్ పోలీసుల ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. అర్బన్ పోలీస్ స్టేషన్ నుంచి ప్రారంభమైన కవాతు అపోలో సర్కిల్, గాంధీ బజార్, తానా సర్కిల్, ఆర్టీసీ బస్టాండ్ తదితర ప్రాంతాల్లో కొనసాగింది.

ఇన్స్పెక్టర్ బి.వి. చలపతి, ఎస్‌ఐ జహీర్ తదితరులు పాల్గొని ప్రజల్లో భద్రతపై విశ్వాసం పెంపొందించారు. చట్టాలను గౌరవించాలని, అనుమానాస్పద విషయాలు గమనిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అవగాహన కల్పించారు.

Tags: Police flag march in Rayachoti