పల్నాడుముచ్చట్లు:
ఓటర్లు అందరూ తమ ఓటు హక్కును విధిగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల పిలుపు!
మున్సిపల్ ఎన్నికల వేళ గుడ్ న్యూస్.. పల్నాడు జిల్లాలో అక్టోబర్ 31, నవంబర్ 2న స్థానిక సెలవులు ప్రకటన!
నవంబర్ 1న మునిసిపల్ ఎన్నికల పోలింగ్ ఉన్న నేపథ్యంలో, ఉద్యోగులు మరియు ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కృతిక శుక్ల కీలక ప్రకటన చేశారు.
అక్టోబర్ 31 (పోలింగ్‌కు ముందు రోజు): అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, కార్యాలయాలకు మరియు పోలింగ్ కేంద్రాలుగా మారే విద్యాసంస్థలకు స్థానిక సెలవు.
నవంబర్ 2 (ఓట్ల లెక్కింపు రోజు): కౌంటింగ్ కేంద్రాలుగా ఉపయోగించే భవనాలు, విద్యాసంస్థలకు సెలవు.
ఓటర్లు అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరడమైనది.
Tags:Local holidays announced in Palnadu district for October 31 and November 2!