పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని మేలుపట్ల ఇండియన్ పెట్రోల్‌బంక్ సమీపంలోగుర్తు తెలియని వ్యక్తి మృతదేహం గురువారం లభ్యమైంది. మృతదేహాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి , గుర్తింపు కోసం అవసరమైన ఆనవాళ్లను సేకరించారు. మృతుడు వయసు సుమారు 40 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు తెలిపారు. మృతుడు ఒంటిపై నలుపురంగు టీషర్టు, నీలంరంగు నైట్‌ఫ్యాంట్ ధరించి ఉన్నట్లు తెలిపారు. మృతుడు వివరాలు తెలిసిన వారు పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
Tags;Body of an unidentified person