October 29, 2026
Explore
వైఎస్సార్‌సిపితోనే అభివృద్ధి సాధ్యం

వైఎస్సార్‌సిపితోనే అభివృద్ధి సాధ్యం

October 29, 2026 | Andhra Pradesh

  • అరాచకాలను ఎదుర్కొండి
    -ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ఇంటింటా ప్రచారం

పుంగనూరు ముచ్చట్లు:

తెలుగుదేశం ప్రభుత్వం ప్రజావ్యతిరేక, అరాచక పాలనకు గుణపాఠం నేర్పాలని , వైఎస్సార్‌సిపి అభ్యర్థుల గెలుపుతోనే అభివృద్ధి సాధ్యమౌతుందని వైఎస్సార్‌సిపి రీజనల్‌ కోఆర్డినేటర్‌ , ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం ఆయన మండలంలోని చండ్రమాకులపల్లె గ్రామంలో ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలు ఆయనకు నీరాజనాలు ఇచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతి ఒక్కరికి జెడ్పిటిసి, ఎంపిటిసి అభ్యర్థుల కరపత్రాలను పంపిణీ చేసి, వైఎస్సార్‌సిపి అభ్యర్థులకు ఫ్యాన్‌ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అరాచకాలతో శాంతియుతంగా ఉన్న పుంగనూరులో విధ్వంసాలు సృష్టిస్తూ, ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి విధ్వంసాలు సృష్టించే వారికి ఓట్లు వేస్తే సమస్యలు తీవ్రమౌతుందన్నారు. ఇలాంటి వారికి ఓటుతో గుణపాఠం నేర్పి, టీడీపీ అభ్యర్థులను ఓడించాలని పిలుపునిచ్చారు. వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి కావాలంటే గ్రామస్థాయి నుంచి వైఎస్సార్‌సిపిని పటిష్టం చేసుకోవాలని కోరారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమౌతుందనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలన్నారు. గత రెండేన్నరేళ్ల తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ కుటుంభానికైన సంక్షేమ పథకాలు అందాయా అంటు ప్రజలను ప్రశ్నించారు. ప్రజలు ముక్తకంఠంతో లేదు…లేదు …అంటు జగనన్నకే ఓటు వేస్తాం అంటు ఉత్తేజపరిచారు. ఈ ప్రచారంలో వైఎస్సార్‌సిపి రాష్ట్ర కార్యదర్శి శ్రీనాథరెడ్డి , జెడ్పిటిసి అభ్యర్థి వెంకటరమణ, నాయకులు నారాయణస్వామి, హేమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:Development is possible only with the YSRCP