April 25, 2026
Explore
టిడిపి బలోపేతమే లక్ష్యం: చమర్తి జగన్ మోహన్ రాజు

టిడిపి బలోపేతమే లక్ష్యం: చమర్తి జగన్ మోహన్ రాజు

April 25, 2026 | Andhra Pradesh

నందలూరు ముచ్చట్లు:

నందలూరులో నిర్వహించిన మండల స్థాయి విస్తృత సమావేశంలో తెదేపా నియోజకవర్గ ఇన్‌చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు, భూ ఆక్రమణలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని, గ్రామ స్థాయిలో ఐక్యత అవసరమని పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమన్వయంతో ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags: The Goal is to Strengthen the TDP: Chamarthi Jagan Mohan Raju