అన్నమయ్య జిల్లా ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లాలో మంత్రి సంతకం ఫోర్జరీ ఘటన కలకలం రేపింది. మంత్రి సత్యకుమార్ యాదవ్ సంతకాన్ని నకిలీగా తయారు చేసిన ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
కదిరి మండలం కౌలేపల్లికి చెందిన వేణు, శేషాద్రి అనే వ్యక్తులు కడప రిమ్స్‌లో పనిచేస్తున్న స్టాఫ్ నర్సు రమణమ్మను మదనపల్లికి బదిలీ చేయిస్తామని చెప్పి ఆమె భర్త నుంచి రూ. లక్ష వసూలు చేశారు. అనంతరం మంత్రి సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ లేఖను అందజేశారు. మోసం జరిగిందని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించగా, నిందితులపై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Tags: Forgery of Minister’s Signature Sparks Uproar in Annamayya District