పుంగనూరుముచ్చట్లు:
అసాంఘిక కార్యక్రమాలు ఎక్కడ జరిగిన, ఎవరు చేసిన వదిలిపెట్టదని మదనపల్లె నూతన డిఎస్పీ పావని పోలీసులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం స్థానిక పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్, రికార్డులను పరిశీలించి పోలీసులతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఐ సుబ్బరాయుడు, ఎస్‌ఐలు అన్సర్‌బాషా, రమణతో కలసి మాట్లాడుతూ పోలీస్ స్టేషన్‌కు వచ్చే వారి పట్ల అభిమానం చూపి , వారి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే యువత మత్తుకు , ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు భానిసలు కాకుండ చూడాలన్నారు. అలాగే ట్రాఫిక్‌ను ఎప్పటికప్పుడు క్రమబద్దీకరించి, పట్టణ ప్రజలకు సేవలు అందించాలని కోరారు.
Tags: Curb anti-social activities.