పుంగనూరుముచ్చట్లు:
మండలంలోని నెక్కుంది కొండలపై వెలసియున్న శ్రీ ప్రసన్నపార్వతిదేవి సమేత శ్రీ అగస్తీశ్వరస్వామి ఆలయంలో మే 1న పౌర్ణమి పూజలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ అర్చకులు ఏర్పాట్లు చేపట్టారు. ఉదయం 6 గంటల నుంచి స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం, పంచామృతాభిషేకాలు నిర్వహించి, స్వామివార్లను ప్రత్యేకంగా అలంకరించనున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పౌర్ణమి పూజల్లో పాల్గొనాలని కోరారు.
Tags;Full Moon Pujas at Sri Agastiswara Temple on May 1st.