April 24, 2026
Explore
జనం రోడ్డేక్కిన పట్టించుకోని అధికారులు

జనం రోడ్డేక్కిన పట్టించుకోని అధికారులు

April 24, 2026 | Andhra Pradesh

  • ఈనెల 6న ధర్నా చేసిన ప్రజలు
  • 20 రోజులుగా దుమ్ములోనే జీవనం

పుంగనూరుముచ్చట్లు:

పుంగనూరు-బెంగళూరు ప్రధాన రహదారి మరమ్మతులు చేయకపోవడంతో వస్తున్న దుమ్ముతో ఆనారోగ్యంపాలౌతున్నామని, ఆహార పదార్థాల్లో దుమ్ము నిండిపోతోందని పట్టణ ప్రజలు ఈనెల 6న ధర్నా చేశారు. సుమారు 20 రోజులు కావస్తున్న అధికారులు పట్టించుకపోవడం పలు విమర్శలకు దారితీస్తోంది. బెంగళూరు రోడ్డును మరమ్మతుల పేరుతో గత రెండు నెలల క్రితం జెసిబిలతో పెరికివేశారు. కత్తార్లపల్లె క్రాస్‌ నుంచి అరవపల్లె వరకు ప్యాచ్‌ వర్క్ చేసి ఆపివేశారు. ఆనాటి నుంచి నేటి వరకు పనులు పూర్తి చేయక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా వదిలివేశారు. దీని కారణంగా పట్టణంలోని ఇండ్లపై దుమ్ము నిండిపోతోంది. తిరిగి జాతీయ రహదారిపై ఆందోళన చేసేందుకు జనం సిద్ధమౌతున్నారు. ఇకనైన జిల్లా కలెక్టర్‌ ఈ విషయమై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై ఆర్‌అండ్‌బి డీఈఈ వెంకటేశ్వర్లును వివరణ కోరగా ఉప్పరపల్లె రోడ్డు పనులు జరుగుతోందని, యుద్ధం కారణంగా తారు రావడం లేదని, 15 రోజుల్లో పనులు చేస్తామని తెలిపారు.

Tags: Officials remain indifferent even as people take to the streets.