- గుట్టుచప్పుడు కాకుండ బోయకొండ ఆలయంలో గోవుల విక్రయాలు
-దానం ఇచ్చిన ఆవులను విక్రయించడమా..? - ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులు
పుంగనూరుముచ్చట్లు:
శ్రీ బోయకొండ గంగమ్మకు భక్తులు భక్తితో సమర్పించుకున్న గోవులను కూటమి ప్రభుత్వం వదలడం లేదు. రకరకాల కారణాలతో గోవులను సంరక్షించాల్సిన బాధ్యత గల దేవాదాయశాఖాధికారులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. భక్తులు సమర్పించిన గోవులను గోశాలలో ఉంచి, వాటి ఆలనపాలన చూడాల్సిన అధికారులు నిర్వాహణ పేరిట రైతుల పేర్లతో విక్రయించుకుని భారీగా సొమ్ముచేసుకోవడంపై గత మూడు రోజుల క్రితం కర్నాటకాకు చెందిన భక్తులు అధికారులతో ఘర్షణ పడటంతో ఈ విషయం వెలుగుచూసింది.
అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని చౌడేపల్లె మండలం, దిగువపల్లె అటవీప్రాంతంలో గల ఎతైన కొండల నడుమ ప్రసిద్ధ క్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయం వెలసియుంది. ఆలయ ఆదాయాన్ని పెంపొందించేందుకు మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిలు కలసి ప్రణాళికలు సిద్ధం చేశారు. వైఎస్సార్‌సిపి ప్రభుత్వం రాగానే ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు సుమారు రూ.200 కోట్ల రూపాయలతో ఆలయానికి గోపురం, నడక మార్గంలో మెట్లు, షెడ్లు, పుష్కరణి, రహదారి, మంచినీరు ఏర్పాటు చేశారు. అలాగే భవన సముదాయం నిర్మించి , వివిధ రూపాలుగా ఆలయానికి ఆదాయం చేకూరేలా చర్యలు చేపట్టారు. వీటితో పాటు ఆలయానికి డిప్యూటి కమీషనర్ హ్గదా కల్పించి , డిసిని నియమించారు. ప్రస్తుతం ఆలయానికి రూ.15 కోట్ల రూపాయలు ఏటా ఆదాయం చేకూరుతోంది. వేలాది మంది కర్నాటక, తమిళనాడు భక్తుల రాకతో ఆలయం ఉమ్మడి జిల్లాల్లో ప్రసిద్ధిగాంచింది.
గోశాల ఏర్పాటు….
ఆలయ సాంప్రదాయాలకు అవసరమైన పాలు సమకూర్చుకునేందుకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి గోశాల ఏర్పాటు చేశారు. ఈ గోశాలకు విస్తతమైన ప్రచారం కల్పించడంతో ఆలయానికి భక్తులు గోవులను విరాళంగా ఇవ్వడం ప్రారంభించారు. ఇందుకోసం ప్రత్యేకమైన షెడ్లు నిర్మించారు. ఇలా ఉండగా 115 గోవులు విరాళంగా ఇచ్చారు. అవి వృద్ధి చెందింది. ప్రస్తుతం ఆ గోవులను సంరక్షించాల్సిన అధికారులు గత రెండు నెలలుగా 31 గోవులను నామమాత్రం ధరలకు విక్రయించడం ఆలస్యంగా వెలుగుచూసింది. ప్రస్తుతం గోశాలలో 61 గోవులు మాత్రమే ఉంది. విశాలమైన అటవీప్రాంతంలో పశువుల పోషణకు అవసరమైన గడ్డి లభిస్తుంది. కానీ ఆవిధంగా పశువులను పోషణ చేయకుండ రూ.1000 లకు విక్రయించడం ఆలస్యంగా వెలుగుచూసింది. రైతుల పేరిట పశువులను విక్రయిస్తున్నారు. ఆలయానికి బహుమతులుగా ఇచ్చిన వాటిని విక్రయించడం , ఇతరులకు బహుమతిగా ఇవ్వరాదు. అలాంటప్పుడు ప్రభుత్వ ఆదేశాలపై భక్తజనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏటా రూ.15 కోట్ల రూపాయలు ఆదాయం ఉన్న ఆలయంలో 100 గోవుల పోషణకు ఎందుకు నిధులు చాలడం లేదంటు నిలధీస్తున్నారు. అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం, దాతలు ఇచ్చిన గోవులను పోషించలేక విక్రయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కాగా ఆలయ అధికారుల వద్ద పశువులను తీసుకున్న రైతుల జాబితా, వాటి వివరాలను వెల్లడించకపోవడం తీవ్ర అనుమానాలకు బలం చేకూర్చుతోంది. దీనిపై జిల్లా కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
డిప్యూటి కమిషనర్ వివరణ….
ఈ విషయమై ఆలయ డిప్యూటి కమిషనర్ ఏకాంబరంను వివరణ కోరగా పశువులను రైతులకు నామమాత్రంగా రూ.1000 లకు ఇవ్వమని ప్రభుత్వ ఆదేశాల ఉందన్నారు. ఈ మేరకు గోవులను హిందూ రైతులకు మాత్రమే ఇవ్వడం జరిగిందన్నారు. ఆరోపణలు అవాస్తవమని, అక్రమాలు జరగలేదని తెలిపారు.



Tags: Cows were not spared during the coalition’s rule.