April 24, 2026
Explore
ప్రొబేషనరీ సబ్-ఇన్‌స్పెక్టర్లకు జిల్లా ఎస్పీ దిశా నిర్దేశం.

ప్రొబేషనరీ సబ్-ఇన్‌స్పెక్టర్లకు జిల్లా ఎస్పీ దిశా నిర్దేశం.

April 24, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

  • పోలీస్ వృత్తి కేవలం ఉద్యోగం కాదు… అది ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే బాధ్యత. క్రమశిక్షణ, నిబద్ధతే, విజయానికి మార్గం. జిల్లా ఎస్పీ.
  • ప్రొబేషన్ కాలాన్ని సమర్థంగా వినియోగించుకుని క్షేత్రస్థాయి అనుభవం పెంపొందించుకోవాలి.
  • స్టేషన్ డ్యూటీ ద్వారా పోలీస్ స్టేషన్ నిర్వహణపై పూర్తి అవగాహన పొందాలి.
  • ప్రజలతో మర్యాదగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.
  • నేర దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలి.
  • క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇచ్చి విధులు నిర్వహించాలి.
  • క్రమశిక్షణ రహితాన్ని పాటించని వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవు – జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, హెచ్చరిక.
  • ఈ రోజు తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్‌లో ప్రొబేషనరీ సబ్-ఇన్‌స్పెక్టర్ల కోసం ఓరియంటేషన్ సెషన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు నూతనంగా విధుల్లో చేరిన అధికారులకు సమగ్ర మార్గదర్శకాలు అందించారు.
  • ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పోలీస్ వృత్తిలో క్రమశిక్షణ, నిబద్ధత, ప్రజలతో వ్యవహార శైలి అత్యంత కీలకమని తెలిపారు. ప్రొబేషన్ కాలంలో అధికారులు తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం ఉందని, స్టేషన్ డ్యూటీలో పనిచేసే వారి పనితీరును నిరంతరం సమీక్షిస్తామని పేర్కొన్నారు.
  • అలాగే విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యం, క్రమశిక్షణ రహితాన్ని ఉల్లంఘిస్తే కఠిన శాఖాపరమైన చర్యలు తీసుకోవడం తప్పదని ఎస్పీ స్పష్టం చేశారు. గత అనుభవాలు మరియు ప్రస్తుత పరిస్థితులను ఉదాహరణలుగా తీసుకుని సమర్థవంతమైన పోలీసింగ్‌కు అవసరమైన నైపుణ్యాలను వివరించారు. ప్రొబేషనరీ అధికారులు పోలీస్ స్టేషన్ నిర్వహణ, కేసు డైరీలు, రికార్డుల నిర్వహణ వంటి అంశాల్లో పట్టు సాధించాలని సూచించారు. పెండింగ్ కేసుల పరిష్కారం, ఆధారాల సేకరణలో సీనియర్ అధికారుల మార్గదర్శకత్వం తీసుకోవాలని తెలిపారు. డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డు బ్యూరో (DCRB), స్పెషల్ బ్రాంచ్ (SB) వంటి ఆయా విభాగాల పనితీరును సమగ్రంగా అవగాహన చేసుకోవాలని సూచించారు.
  • ప్రజల సమస్యలను ఓపికగా వినడం, మర్యాదగా స్పందించడం ద్వారా పోలీస్ శాఖపై నమ్మకాన్ని పెంపొందించాల్సిన బాధ్యత,ప్రతి అధికారిపై ఉందని ఎస్పీ పేర్కొన్నారు. అలాగే నేర దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానం, సైబర్ టూల్స్ వినియోగం ఎంతో కీలకమని వివరించారు.
  • ప్రొబేషన్ కాలంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేసి ప్రోత్సహించారు. మెరుగైన పనితీరుతో ముందుకు వచ్చిన వారిని భవిష్యత్తులో కీలక బాధ్యతలను కూడా అప్పగిస్తామని తెలిపారు.
  • ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు వెంకట్రావు (పరిపాలన), రవి మనోహర్ చారి (శాంతి భద్రతలు), శ్రీనివాసులు (క్రైమ్స్), గీతా కుమారి (ఎస్‌బి) మరియు సీఐ విక్రమ్ (ఎస్‌బి) పాల్గొన్నారు.

Tags: