April 24, 2026
Explore
కేంద్ర ఉద్యోగులకు సరికొత్త జీవిత బీమా

కేంద్ర ఉద్యోగులకు సరికొత్త జీవిత బీమా

April 24, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

▪️బ్యాంకింగ్ సేవలతోపాటు బీమా సదుపాయం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం, వారి భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం సరికొత్త జీవిత బీమా పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా బ్యాకింగ్ సేవలతో పాటు, ఇన్సూరెన్స్ సేవలు, వివిధ రకాల ప్రయోజనాలు లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక సహకారం, ఇతర సమస్యల పరిష్కారానికి ఇది ‘వన్ స్టాప్ సొల్యూషన్’ లాగా పనిచేస్తుంది. ఈ కొత్త పథకం ద్వారా అన్ని స్థాయిల్లో, అన్ని విభాగాల్లో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ ప్రయోజనాలు కలగనున్నాయి. జీరో-బ్యాలెన్స్ శాలరీ అకౌంట్, ఉచితంగా ఆర్ఎఎస్, నిఫ్ట్, యూపీఐ వంటి రెమిటెన్స్లు, తక్కువ వడ్డీ రేట్లకే గృహ, విద్య, వెహికల్స్, వ్యక్తిగత రుణం అందించే సౌకర్యం, లాకర్ అద్దె, లోన్ ప్రాసెసింగ్ లలో అదనపు చార్జీలపై మినహాయింపు సౌకర్యం, రూ.1.5 కోట్ల వరకు వ్యక్తిగత ప్రమాద బీమా, విమాన ప్రమాదాల్లో మరణిస్తే రూ.2 కోట్లు, వరకు బీమా, శాశ్వత, పాక్షిక వైకల్యానికి రూ.1.5 కోట్ల వరకు బీమా సౌకర్యం, రూ.20 లక్షల వరకు టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్, అదనంగా టాప్లైప్ సదుపాయం వంటి ప్రయోజనాలు లభించనున్నాయి.

Tags: Brand New Life Insurance for Central Government Employees