April 24, 2026
Explore
హైకోర్టు  సంచలన తీర్పు

హైకోర్టు సంచలన తీర్పు

April 24, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

కారుణ్య నియామకాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన సంచలన మరియు ఆందోళనకర తీర్పు (W.P.No. 6472 of 2025) గురించి.

ముఖ్య అంశాలు:
• కారుణ్య నియామకాలు ఇకపై ‘రెగ్యులర్’ ఉద్యోగాలు కాదని, కేవలం అవుట్ సోర్సింగ్ (Outsourcing) లేదా తాత్కాలిక ప్రాతిపదికన మాత్రమే ఉండాలని కోర్టు పేర్కొంది.
• చనిపోయిన ఉద్యోగికి వచ్చే బెనిఫిట్స్ (Pension, Gratuity) కుటుంబానికి సరిపోతాయని ప్రభుత్వం భావిస్తే, ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
• కేవలం అత్యంత పేదరికంలో ఉన్న (Hand-to-mouth) కుటుంబాలకు మాత్రమే ఈ నియామకాలు వర్తింపజేయాలని సూచించింది.
• రాష్ట్ర ప్రభుత్వం 3 నెలల లోపు ఈ కొత్త నిబంధనలతో మార్గదర్శకాలను (Guidelines) సవరించాలని ఆదేశించింది.
ఈ తీర్పు అమలైతే భవిష్యత్తులో ఉద్యోగస్తుల కుటుంబాలకు కారుణ్య నియామక హక్కు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది.

🔹 కేసు నేపథ్యం
పిటిషనర్ తండ్రి ప్రభుత్వ ఉద్యోగి (Library Assistant)గా పనిచేస్తూ మరణించారు.
పిటిషనర్ (కూతురు) compassionate appointment (దయాధారిత నియామకం) కోరింది.
ఆమె ఇప్పటికే పెళ్లైనది.
ఆమె తన తండ్రిపై ఆధారపడి ఉందని చెప్పింది

🔹 కోర్టు పరిశీలించిన ముఖ్య అంశాలు

  1. ❗ Compassionate appointment హక్కు కాదు, కేవలం కుటుంబానికి వచ్చిన ఆర్థిక ఇబ్బందిని తగ్గించేందుకు ఇచ్చే సహాయం మాత్రమే.
  2. 📊 రాష్ట్రంలో భారీ సంఖ్యలో నియామకాలు
    2014 నుండి ఇప్పటివరకు సుమారు 20,801 compassionate appointments ఇచ్చారు.
    కోర్టు దీనిని “అత్యధికం” (staggering) అని పేర్కొంది

🌐ఎవరు “Dependent”?
కోర్టు స్పష్టత ఇచ్చింది:
నిజంగా ఆధారపడిన వారు మాత్రమే అర్హులు
(భార్య, పిల్లలు, తల్లిదండ్రులు మాత్రమే)
దూర సంబంధాలు లేదా కేవలం పేరు కోసం dependents అనడం సరిపోదు.

🚀3 నెలల్లో అమలు
ప్రభుత్వం 3 నెలల్లో కొత్త పాలసీ తీసుకురావాలి అని ఆదేశించింది.

Tags; High Court’s Sensational Verdict