April 24, 2026
Explore
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం

April 24, 2026 | Andhra Pradesh

అనకాపల్లిలో బ్లాక్ స్పాట్ల ఉమ్మడి తనిఖీ

అనకాపల్లి ముచ్చట్లు:

జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ ఆదేశాల మేరకు, జిల్లాలో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు పోలీస్ మరియు రవాణా శాఖ అధికారులు సమన్వయంతో ముందడుగు వేస్తున్నారు. ఇందులో భాగంగా నేడు అనకాపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కీలక ప్రాంతాల్లో అధికారుల బృందం క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టింది.

ఈ కార్యక్రమంలో అనకాపల్లి డీఎస్పీ ఎం.శ్రావణి , ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వెంకట నారాయణ , మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (MVI) లీలా ప్రసాద్ మరియు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) అధికారులు సంయుక్తంగా పాల్గొన్నారు.

​అధికారుల బృందం ముఖ్యంగా ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్న (Accident Prone Areas) ఈ క్రింది ప్రాంతాలను పరిశీలించారు:
​నూకాలమ్మ తల్లి ఆలయ ఆర్చి జంక్షన్
​శారదా నది బ్రిడ్జి ప్రాంతం
​కొత్తూరు జంక్షన్

​బ్లాక్ స్పాట్ల గుర్తింపు: గతంలో జరిగిన ప్రమాదాలను విశ్లేషించి, ఆయా జంక్షన్ల వద్ద ఉన్న లోపాలను అధికారులు గుర్తించారు.

జంక్షన్ల వద్ద సిగ్నలింగ్ వ్యవస్థ, రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు, హెచ్చరిక బోర్డుల ఏర్పాటుపై NHAI అధికారులకు డీఎస్పీ పలు సూచనలు చేశారు.

వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు మరియు పాదచారుల భద్రత కోసం తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై ప్రణాళికలు సిద్ధం చేశారు.

​ఈ సందర్భంగా డీఎస్పీ శ్రావణి మాట్లాడుతూ.. ప్రజల ప్రాణరక్షణే ధ్యేయంగా ఎస్పీ సూచనల మేరకు ఈ తనిఖీలు చేపట్టామని, హైవేపై ప్రయాణించే వారు ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని కోరారు.

Tags: The Goal is the Prevention of Road Accidents.