April 23, 2026
Explore
అన్ని శాఖలు 100 శాతం ల‌క్ష్యాల‌ను సాధించాలి

అన్ని శాఖలు 100 శాతం ల‌క్ష్యాల‌ను సాధించాలి

April 23, 2026 | Andhra Pradesh

జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా

పల్నాడు ముచ్చట్లు:

పల్నాడు జిల్లాలో ప్రభుత్వ ప్రాధాన్యత సూచికల (కీ ఫెర్‌ఫార్మెన్స్ ఇండికేట‌ర్స్‌) అమలులో జిల్లాను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ఆదేశించారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల పనితీరును కలెక్టర్ సమీక్షించారు .నిర్దేశించిన లక్ష్యాలను వంద శాతం పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా జిల్లాలోని అన్ని శాఖలు తప్పనిసరిగా ‘ఏ+’ గ్రేడ్ సాధించాలని దిశానిర్ధేశం చేశారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులు క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువ కావడంలో కెపిఐ కీలకమని, ఆయా సూచీల్లో వెనుకబడిన శాఖలు తక్షణమే పురోగతి సాధించాలని సూచించారు.2026-27 సంవ‌త్స‌రానికి సంబంధించి 396 ఇండికేట‌ర్స్‌లో అత్యుత్త‌మ గ్రేడ్‌ల‌ను సాధించేదుకు అధికారులు కృషి చేయాల‌ని కోరారు. అలాగే మండ‌లాల‌కు నిర్ధేశించిన 199 ఇండికేట‌ర్స్‌లో మెరుగైన ప‌నితీరును ప్ర‌ద‌ర్శించాల‌న్నారు. 29వ తేదీనాటికి అన్ని నివేదిక‌ల‌ను స‌మ‌గ్రంగా అంద‌జేయాల‌ని చెప్పారు.

Tags: All departments must achieve 100% of their targets.