వాల్మీపురం ముచ్చట్లు:
వాల్మీపురం మండలంలో విషాదకర ఘటన బుధవారం చోటుచేసుకుంది. విధులు నిర్వహిస్తున్న లైన్‌మన్ దామోదరరెడ్డి కరెంట్ షాక్‌కు గురై మృతి చెందాడు.
జార్రపల్లె వద్ద విద్యుత్ మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా షాక్ తగిలి స్తంభం పై నుంచి కిందపడిపోయాడు. తీవ్ర గాయాలపాలైన ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, స్థానికులు విషాదంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Tags; Lineman Dies from Electric Shock