మదనపల్లి మదనపల్లి
మదనపల్లెలో కోడలిపై అత్తమామలు దాడి చేసిన ఘటన వెలుగుచూసింది. నక్కలదిన్నె తండాకు చెందిన రవినాయక్ భార్య తన అత్తమామలు లక్ష్మమ్మ, మునిస్వామి నాయక్‌లకు రూ.7 లక్షలు అప్పుగా తీసిచ్చినట్లు తెలిపింది. అలాగే తన వద్ద ఉన్న 30 గ్రాముల బంగారాన్ని కూడా అవసరాల కోసం ఇచ్చినట్లు ఆరోపించింది.
తీసిచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలని అడగడంతో అత్తమామలతో పాటు ఆడబిడ్డ గాయత్రి కలిసి దాడి చేసి గాయపరిచినట్లు బాధితురాలు వాపోయింది. ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
Tags; In-laws attack daughter-in-law in Madanapalle.