మదనపల్లె ముచ్చట్లు:
మదనపల్లెలో 10వ తరగతి మైనర్ బాలిక ప్రసవించిన ఘటనలో కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి. ఘటనపై స్పందించిన డీఎస్పీ పావని ఆస్పత్రికి వెళ్లి బాధితురాలిని విచారించారు.
విచారణలో బాలిక గర్భానికి సంబంధించి పాఠశాలకు చెందిన గురువుపై అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు సమాచారం. ఈ విషయంపై డీఎస్పీ ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వెంటనే కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేపట్టాలని తాలూకా సీఐ కళా వెంకటరమణకు ఆదేశించారు.
ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసులు దర్యాప్తులో వెలికితీస్తున్నారు.
Tags: Suspicion Cast on Teacher in Case Involving Minor Girl; Order Issued to Register Case