April 23, 2026
Explore
జాతీయ స్థాయిలో మెరిసిన అన్నమయ్య జిల్లా స్కౌట్ ఆణిముత్యం

జాతీయ స్థాయిలో మెరిసిన అన్నమయ్య జిల్లా స్కౌట్ ఆణిముత్యం

April 23, 2026 | Andhra Pradesh

పెద్దమండ్యం ముచ్చట్లు:

పెద్దమండ్యం మండలం వెలిగల్లు ప్రభుత్వ పాఠశాలకు చెందిన స్కౌట్ విద్యార్థి బి. శైలేష్ గౌడ్ (2వ తరగతి) జాతీయ స్థాయిలో నిర్వహించిన స్పెల్ బీ పోటీలలో ద్వితీయ స్థానం సాధించి రజత పతకం గెలుచుకున్నాడు.

ఈ విషయాన్ని స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా కార్యదర్శి మడితాటి నరసింహారెడ్డి గురువారం వెల్లడించారు. ఈ నెల 22న ముంబైలో నిర్వహించిన వర్డ్ పవర్ ఛాంపియన్ షిప్ (WPC) స్పెల్ బీ ఫైనల్స్‌లో దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతుల మధ్య పోటీ పడి శైలేష్ ఈ ఘన విజయం సాధించడం గర్వకారణమని తెలిపారు.

మారుమూల గ్రామం నుంచి వెళ్లి దేశంలోని ప్రతిభావంతులతో పోటీ పడి, అన్నమయ్య జిల్లా ఖ్యాతిని దేశ ఆర్థిక రాజధాని ముంబైలో చాటిన శైలేష్‌ను జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ కే. సుబ్రహ్మణ్యం అభినందించారు. అలాగే అతడిని విజేతగా తీర్చిదిద్దిన స్కౌట్ మాస్టర్ మధుకర్ రెడ్డిని కూడా ప్రశంసించారు.

Tags; Annamayya District’s Scout Gem Shines on the National Stage