April 23, 2026
Explore
ట్రక్ షీట్ లు రాక ఎక్కడ లారీలు అక్కడే నిలిచిపోయాయి

ట్రక్ షీట్ లు రాక ఎక్కడ లారీలు అక్కడే నిలిచిపోయాయి

April 23, 2026 | Andhra Pradesh

ఏలూరు ముచ్చట్లు:

ధాన్యం లోడింగ్ చేసే హమాలీలు దొరకక రైతులు నాన్న ఇబ్బంది పడి ఏదో రకంగా లారీలు లోడ్ చేయించుకుంటుంటే ఒకపక్క ట్రక్ షీట్ లు రాక నిలిచిపోతున్నా లారీలు .

దానం రాశులు వద్ద హమాలీలు ఉదయం నుంచి సాయంత్రం వరకు గోని సంచుల్లో పట్టి కాటాలు వేసి సాయంత్రం లారీలు లోడ్ చేసే సమయానికి (RBK )ట్రక్ షీట్లు ఇచ్చే కంప్యూటర్ ఆపరేటర్లు 6 గంటలకే వెళ్లిపోతున్న పరిస్థితి.

ఒక ధాన్యం లోడు రవాణా చేయాలంటే రెండు రోజులు సమయం పడుతుంది అంటున్నా లారీ ఓనర్లు.

ఒకపక్క లారీలు దొరకక రైతులు నానా ఇబ్బంది పడుతుంటే లోడ్ చేసిన లారీలు ఎక్కడ లారీలు అక్కడే నిలిచిపోతున్న పట్టించుకోని అధికారులు.

ఒకపక్క లారీ ఓనర్లకు డబ్బులు చెల్లించలేదని ఆవేదన చెందితుంటే, మరోపక్క లోడైన లారీలకు ట్రక్ సీట్లు ఇవ్వకపోవడంతో నాన్న ఇబ్బందులు పడుతున్న లారీ ఓనర్లు.

ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో లారీ డ్రైవర్లకు తాగటానికి మంచినీరు భోజనం సకాలంలో అందకపోవటంతో ఇబ్బంది పడుతున్న లారీ డ్రైవర్లు.

జిల్లా అధికారులు స్పందించి లోడైన లారీలకు వెంటనే ట్రక్ షీట్లు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్న లారీ యాజమాన్యం.

Tags: Due to the non-arrival of truck sheets, the lorries have come to a standstill right where they were.