April 23, 2026
Explore
ఘోరం: ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి

ఘోరం: ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి

April 23, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతి జిల్లా వెంకటకృష్ణపాలెంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. అన్యోన్యంగా జీవిస్తున్న ఒక కుటుంబం ఒక్కసారిగా విషాదంలో ముగిసింది. తల్లి చంద్రకళ, భార్య హరితను హత్య చేసిన మోహన్(40) అనంతరం తన పిల్లలు కౌశిక్(14), హరిణి(12)తో కలిసి రైలు పట్టాలపై మృతదేహాలుగా కనిపించారు.

పిల్లలు చనిపోవద్దని తండ్రిని వేడుకున్నప్పటికీ, అతనిని కాపాడే ప్రయత్నంలోనే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ ఘటన ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags; Tragedy: Five Members of the Same Family Die