అమరావతి ముచ్చట్లు:
ఏపీలో కూటమి ప్రభుత్వం జూన్ 12వ తేదీన రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొత్తగా పెన్షన్ల మంజూరుకు సిద్ధమైంది. తొలి విడతగా సుమారు 1.53 లక్షల మంది అర్హులైన వితంతువులకు నెలకు రూ.4,000 చొప్పున పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం నెలకు రూ.61 కోట్లు వెచ్చించనుంది. ఇప్పటికే 2.30 లక్షల మందికి ‘స్పౌజ్’ కేటగిరీలో పెన్షన్లు అందజేస్తుండగా, తదుపరి దశలో అర్హులైన దివ్యాంగులకు కూడా కొత్త పింఛన్లు మంజూరు చేసేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
Tags: Pension Assurance for Widows in AP Starting June 12th?