అమరావతిముచ్చట్లు:
జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఈ నెల 24న రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అడిషనల్ కమిషనర్ సుధాకర్రావు ఆదేశాలిచ్చారు. మండల, జిల్లా, గ్రామ స్థాయిలో తగిన విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని జడ్పీ సీఈఓలు, డీపీఓలకు ఆదేశాలిచ్చారు. ముందుగానే సమాచారమిచ్చి అన్ని శాఖలు, ప్రజలు గ్రామ సభకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.
Tags: Special Gram Sabhas in Panchayats on the 24th