April 23, 2026
Explore
కల్లులో కల్తీకి డ్రగ్స్.. హైదరాబాద్‌లో రూ.17 కోట్ల మత్తుపదార్థాలు సీజ్!

కల్లులో కల్తీకి డ్రగ్స్.. హైదరాబాద్‌లో రూ.17 కోట్ల మత్తుపదార్థాలు సీజ్!

April 23, 2026 | Andhra Pradesh

హైదరాబాద్‌ ముచ్చట్లు:

హైదరాబాద్‌లో భారీ డ్రగ్స్ రాకెట్‌ను ఛేదించిన ఎన్‌సీబీ

మౌలాలిలో రూ.17.40 కోట్ల విలువైన అల్ప్రజోలామ్ స్వాధీనం

కల్లులో కల్తీ చేసేందుకు డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు వెల్లడి

ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న అధికారులు

ఎన్‌సీబీ అధికారుల కథనం ప్రకారం, మౌలాలిలోని ఓ పారిశ్రామిక యూనిట్‌లో డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు అందిన పక్కా సమాచారంతో ఈ దాడులు నిర్వహించారు. అక్కడి రెండు ప్లాస్టిక్ డ్రమ్ముల్లో దాచి ఉంచిన అల్ప్రజోలామ్‌ను గుర్తించారు. వేసవిలో కల్లుకు ఉండే అధిక డిమాండ్‌ను లక్ష్యంగా చేసుకుని, కల్లులో కల్తీ చేసేందుకు ఈ డ్రగ్స్‌ను భారీ ఎత్తున తయారు చేస్తున్నట్లు విచారణలో తేలింది. ఈ కల్తీ కల్లు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.

అరెస్ట్ అయిన ముగ్గురిలో డ్రగ్స్ తయారీలో నైపుణ్యం ఉన్న కెమిస్ట్, ముడి పదార్థాలు సరఫరా చేసే వ్యక్తి, తయారైన డ్రగ్స్‌ను స్వీకరించే వ్యక్తి ఉన్నట్లు ఎన్‌సీబీ అధికారులు తెలిపారు. వీరిపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ డ్రగ్స్ నెట్‌వర్క్ వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు, రాష్ట్రంలో ఎక్కడికి సరఫరా చేస్తున్నారనే కోణంలో విచారణ కొనసాగుతోంది.

Tags: Drugs Used to Adulterate Toddy: Narcotics Worth ₹17 Crore Seized in Hyderabad!