April 23, 2026
Explore
అమరావతి రాజధానిగా కొత్త మ్యాప్ విడుదల

అమరావతి రాజధానిగా కొత్త మ్యాప్ విడుదల

April 23, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు:

కొత్త మ్యాప్ విడుదల చేసన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించిన కేంద్ర ప్రభుత్వం

కొత్త మ్యాప్ లో ఏపీ రాజధానిగా అమరావతి

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు-2026కు పార్లమెంట్ ఆమోదం తెలపడంతో, అమరావతికి తిరుగులేని అధికారిక హోదా దక్కింది. 2024 జూన్ 2 నుండి ఇది అమల్లోకి వచ్చేలా చట్టం చేయడం గమనార్హం. దీంతో గత కొన్నేళ్లుగా సాగుతున్న ‘మూడు రాజధానుల’ గందరగోళానికి శాశ్వతంగా తెరపడింది.

ఏపీ అడ్మినిస్ట్రేటివ్ మ్యాప్‌లో మరో కీలక మార్పు చోటుచేసుకుంది. కొత్తగా మార్కాపురం, పోలవరం జిల్లాలను ఏర్పాటు చేయడంతో రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 28కి చేరింది. ఈ నూతన జిల్లాల సరిహద్దులతో కూడిన అధికారిక పటాన్ని ప్రభుత్వం విడుదల చేసింది.

కేంద్ర ప్రభుత్వం కూడా తన రికార్డుల్లో, భారత అధికారిక మ్యాప్‌లో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని అప్‌డేట్ చేసింది. ఇది దేశవ్యాప్త పరిపాలన అవసరాలకు ప్రామాణికంగా నిలవనుంది.

Tags: New Map Released with Amaravati as Capital