April 23, 2026
Explore
మరో ఆరు నెలలు హార్మూజ్ క్లోజ్!

మరో ఆరు నెలలు హార్మూజ్ క్లోజ్!

April 23, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఎన్నికలు ముగియగానే భారత్‍లో పెట్రోల్ ధరల పెంపు?* ఇజ్రాయెల్, అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం ప్రపంచ దేశాల్లో చమురు సంక్షోభానికి గురి చేస్తోంది. ఇరు పక్షాల మధ్య సీజ్ ఫైర్ అంశంపై శాంతి చర్చలు ఇంకా ప్రయత్నాల దశలోనే ఉన్న నేపథ్యంలో హర్మూజ్ జలసంధి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.తాజా పరిణామాలతో ఈ జలమార్గం అందుబాటులోకి వస్తుందని తద్వారా తమకు ఇంధన కష్టాలు తప్పుతాయని ప్రపంచ దేశాలు భావించినా పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. దీంతో ఈ మార్గం పూర్తిగా తెరిచేందుకు మరో ఆరు నెలలైనా పట్టే అవకాశం ఉందని తాజాగా అమెరికా అంచనా వేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాల్లో పేర్కొనడం కలకలం రేపుతోంది. ఇదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరల సెగలు కక్కే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.

సవాలుగా సీమైన్స్ గుర్తింపు:

తాజాగా పెంటగాన్, అమెరికా చట్టసభ సభ్యుల మధ్య సీక్రెట్ సమావేశం జరిగిందని ఈ సమావేశంలో అమెరికా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ హర్మూజ్ మార్గంపై కీలక నివేదిక చట్టసభ సభ్యులకు వివరించినట్లు ఈ కథనాలు పేర్కొన్నాయి. ఇరాన్ సైన్యం ఈ హర్మూజ్ జలసంధిలో అమర్చిన సీ మైన్స్ కారణంగానే ఈ మార్గం పూర.

Tags: Strait of Hormuz Closed for Another Six Months!