April 23, 2026
Explore
మహిళల భద్రతపై సమగ్ర అవగాహన కార్యక్రమం.

మహిళల భద్రతపై సమగ్ర అవగాహన కార్యక్రమం.

April 23, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

  • గ్రామీణ మహిళల్లో చట్టాలపై స్పష్టమైన అవగాహన కల్పన.
  • అత్యవసర సేవలు, శక్తి టీమ్ సేవల వినియోగంపై మార్గనిర్దేశం.
  • మహిళలపై నేరాల నివారణకు ముందస్తు జాగ్రత్తలపై సూచనలు.
  • తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, ఆదేశాల మేరకు, పోలీస్ అధికారులు మరియు మండల స్థాయి అధికారులతో కలిసి చిట్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళల భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
  • ఈ కార్యక్రమంలో సుమారు మహిళలు పాల్గొని, పోలీస్ శాఖ అందించిన మార్గనిర్దేశాన్ని ఆసక్తిగా స్వీకరించారు. మహిళలపై జరుగుతున్న వివిధ రకాల నేరాలు, ముఖ్యంగా గృహహింస, వేధింపులు, సైబర్ మోసాలు, బాల్య వివాహాల వంటి అంశాలపై అధికారులు వివరంగా అవగాహన కల్పించారు. అలాగే, శక్తి టీమ్ సేవలు, మహిళల కోసం అందుబాటులో ఉన్న హెల్ప్‌లైన్ నంబర్లు, పోలీస్ స్టేషన్‌లో అందించే సేవల గురించి కూడా తెలియజేశారు.
  • మహిళలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా భయపడకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలని, చట్టం వారికి పూర్తి రక్షణ కల్పిస్తుందని అధికారులు హితవు పలికారు. కుటుంబ మరియు సామాజిక స్థాయిలో మహిళల భద్రతకు అందరూ బాధ్యత వహించాలని సూచించారు.
  • అదేవిధంగా, గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాల ద్వారా మహిళల్లో ధైర్యం, స్వీయరక్షణ భావన పెంపొందించడం పోలీస్ శాఖ ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు. మహిళలు తమ హక్కులపై అవగాహన పెంపొందించుకుని, సురక్షితమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
  • తిరుపతి జిల్లా పోలీస్ శాఖ మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు వెంటనే పరిధిలోని పోలీస్ స్టేషన్ కి లేదా 112 కి సమాచారం అందించాలని, తక్షణ సహాయం చేయడానికి పోలీస్ శాఖ ముందుంటుందని విజ్ఞప్తి చేశారు.

Tags: A Comprehensive Awareness Program on Women’s Safety