తిరుమల ముచ్చట్లు:
తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాల్లో ఏప్రిల్ 25వ తేదీ నుండి మూడు రోజుల పాటు జరుగనున్న శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలకు టిటిడి ఏర్పాట్లు పూర్తి చేసింది.
టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో పరిణయోత్సవ మండపాన్ని దశావతారం, అష్టలక్ష్ముల వంటి ఆధ్యాత్మిక రూపాలతో దాదాపు 100 మంది నిపుణులు అలంకరిస్తున్నారని టిటిడి ఉద్యానవన డిప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు తెలిపారు.
పూణేకు చెందిన శ్రీ వేంకటేశ్వర రిలీజియస్ చారిటబుల్ ట్రస్ట్ రూ.30 లక్షలతో వేదికను వైభవంగా ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చారు.
మూడురోజులపాటు జరుగనున్న ఈ వేడుకలో తొలిరోజు శ్రీ మలయప్పస్వామివారు గజవాహనంపై, రెండవరోజు అశ్వవాహనంపై, చివరిరోజు గరుడవాహనంపై వేంచేపు చేస్తారు.
మరోపక్కఉభయనాంచారులు ప్రత్యేక పల్లకీలలో పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేస్తారు. ఆ తరువాత కల్యాణమహోత్సవం కన్నులపండుగగా నిర్వహిస్తారు.
Tags:Arrangements for the Sri Padmavathi Parinayotsavams in Tirumala have been completed.