గుంటూరు ముచ్చట్లు:
గుంటూరు నగరంలోని నెహ్రూ నగర్ 5వ లైన్‌లో ఉన్న ST.LUKE’S SCHOOL యాజమాన్యంపై జిల్లా విద్యాశాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థులను ప్రతిరోజూ ఎలాంటి కారణం లేకుండా పాఠశాల వెలుపల ఎండలో నిలబెట్టిస్తూ బ్యాగులు మోసేలా చేయడం వంటి అమానుష చర్యలపై వచ్చిన ఫిర్యాదులను మేరకు తక్షణమే స్పందించిన గుంటూరు జిల్లా విద్యాధికారి ఇంచార్జ్ (డీఈఓ) జి. యేసు రత్నం పరిగణనలోకి తీసుకున్నారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా పాఠశాల యాజమాన్యానికి డీఈఓ కార్యాలయం నుండి షోకాజ్ నోటీసు జారీ చేయబడింది. విద్యార్థులను ఎండలో నిలబెట్టడం అనేది మానవత్వానికి విరుద్ధమని, ఇది విద్యా నిబంధనలకు వ్యతిరేకమని అధికారులు స్పష్టం చేశారు.రెండు రోజులలోగా సమగ్ర వివరణ సమర్పించాలనీ, లేకపోతే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Tags: DEO Issues Show-Cause Notice to St. Luke’s School