పుంగనూరు ముచ్చట్లు:
మండలంలోని అడవినాథునికుంటలో గల మోడల్‌స్కూల్‌లో అడ్మీషన్ల కోసం జరిగిన ప్రవేశ పరీక్షల్లో 78 మంది విద్యార్థులు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ టిఎన్.రమ తెలిపారు. గురువారం ప్రిన్సిపాల్ ప్రకటన విడుదల చేశారు. ఈనెల 12న జరిగిన ప్రవేశ పరీక్షల్లో 111 మంది పరీక్షలకు ధరఖాస్తు చేసి 104 మంది విద్యార్థులు పరీక్షలు రాశారన్నారు. వీరిలో 78 మంది ఎంపికైయ్యారని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల మేరకు విద్యార్థులు మార్కుల జాబితాలను తీసుకుని ఎంపికైన విద్యార్థులు తమ ఒరిజనల్ రికార్డులతో అడ్మీషన్లు పొందాలని కోరారు.
Tags: 78 Selected in Model School Entrance Exams