పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని బజారువీధిలో గల శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకల్లో భాగంగా గురువారం ఆర్యవైశ్యులు పవిత్ర గంగాజలాలతో ర్యాలీ నిర్వహించారు. సంఘ అధ్యక్షుడు బాలసుబ్రమణ్యం ఆధ్వర్యంలో ఆర్యవైశ్యులు అందరు కలసి స్థానిక అమ్మవారి ఆలయం వద్ద నుంచి కోనేరు వద్దకు వెళ్లి అక్కడ గంగాజలాలను తీసుకొచ్చి ర్యాలీగా పూజలు నిర్వహించారు. గంగాజలాలతో అమ్మవారి జయంతి వేడుకలు ప్రారంభించారు. ఈ సందర్భంగా హోమాలు నిర్వహించి, అమ్మవారికి పూజలు నిర్వహించారు . ఈ కార్యక్రమంలో పట్టణంలోని ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు పాల్గొనడం గమనార్హం.


Tags: Ganga water rally by Arya Vaishyas