April 23, 2026
Explore
25న తొలిసారిగా పుంగనూరులో పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్షలు

25న తొలిసారిగా పుంగనూరులో పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్షలు

April 23, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరులో తొలిసారిగా పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు ఎంఈవో నటరాజారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వాదేశాల మేరకు రాబోవు విద్యా సంవత్సరంలో పాలిటెక్నిక్‌ అడ్మీషన్ల కోసం ఈనెల 25న పుంగనూరులో రెండు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బసవరాజ ప్రభుత్వ హైస్కూల్‌, మున్సిపల్‌ ఉన్నత పాఠశాలల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు తమ హాల్‌టికెట్టు, గుర్తింపు కార్డులు తప్పక తీసుకురావాలని సూచించారు. ముఖ్యంగా బ్లూట్యూత్‌, వెహోబైల్‌ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, ఎలక్ట్రానిక్‌ పరికరాలను పరీక్షా కేంద్రంలోనికి అనుమతించబడదన్నారు. విద్యార్థులు తమ సెంటర్లకు సకాలంలో చేరుకుని పరీక్షలు రాయాలని కోరారు.

Tags: Polytechnic Entrance Exams to be Held in Punganur for the First Time on the 25th