April 23, 2026
Explore
యుగాంతం ఆరోజే.. డేట్‌తో సహా చెప్పిన సైంటిస్ట్‌!

యుగాంతం ఆరోజే.. డేట్‌తో సహా చెప్పిన సైంటిస్ట్‌!

April 23, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:


యుగాంతం వస్తుంది.. త్వరలోనే ప్రళయం వస్తుంది అనే వార్తలు తరచూ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని కొందరు ఉటంకిస్తారు. బాబావంగా భవిష్యవాణిని మరికొందరు ఉటంకిస్తారు. ఇలా వివిధ పండితులు, సిద్దాంతుల అంచనాల ఆధారంగా యుగాంతంపై వివిధ కథనాలు ప్రచారంలో ఉన్నాయి. తాజాగా ఓ సైంటిస్టు చెప్పిన తేదీ వైరల్‌ అవుతోంది. 1960ల్లో సిస్టమ్స్‌ థియరీ పితామహుడు కింజ్‌వాట్‌ ఫోస్టర్, భవిష్యత్తును ముందుగా చూసిన లెక్కలు వేశాడు. జ్యోతిష్యం కాదు, తత్వశాస్త్రం కాదు.. పూర్తిగా సైంటిఫిక్‌ మోడల్స్‌ ఆధారంగా. అతని లెక్కల ప్రకారం, 2026 నవంబర్‌ 13, శుక్రవారం నుంచి మానవ జాతి ముగుస్తుంది. ఇది సైన్స్‌ చరిత్రలో అత్యంత వివాదాస్పదమైన అంచనా. ప్రకృతి విపత్తులు కాదు, మానవులు సృష్టించుకున్న ఒక అసాధారణ సమస్యే కారణం.

సిస్టమ్స్‌ థియరీ ద్వారా భయంకర అంచనా
ఫోస్టర్‌ సిస్టమ్స్‌ థియరీలో నిపుణుడు. అతను మానవ సమాజాన్ని ఒక డైనమిక్‌ సిస్టమ్‌గా చూశాడు. అణు ఆయుధాల సామర్థ్యం, గ్రహాంతర బెదిరింపులు, జనాభా వృద్ధి రేట్లు మేరకు. ఈ మూడు అంశాల సమ్మేళనం ‘అనంతత్వ బిందువు’ను సృష్టిస్తుందని అతను లెక్కించాడు.

Tags: The End of the World Is on That Very Day—Scientist Predicts the Date!