తిరుపతి ముచ్చట్లు:
: డా. చక్రవర్తి రంగనాథన్
ఘనంగా ముగిసిన అవతార మహోత్సవాలు
శ్రీ రామానుజాచార్యుల గ్రంథాలు ఆధ్యాత్మికత, తాత్వికతతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయని డా. చక్రవర్తి రంగనాథన్ తెలిపారు.టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో మూడు రోజుల పాటు జరిగిన అవతార మహోత్సవాలు బుధవారం ఘనంగా ముగిశాయి.ఈ సందర్భంగా రామానుజాచార్యులు భక్తి మార్గాన్ని ప్రజలకు సులభంగా అందుబాటులోకి తీసుకువచ్చిన మహానుభావుడని పేర్కొన్నారు. ఆయన బోధనలు దేశవ్యాప్తంగా విస్తరించాయని తెలిపారు.అనంతరం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు రాజ్యలక్ష్మీ బృందం ఆలపించిన సంకీర్తనలు ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో కో-ఆర్డినేటర్ పురుషోత్తం, భక్తులు పాల్గొన్నారు.
Tags; The Literary Wealth of Sri Ramanujacharya, Who Attained Universal Renown