మచిలీపట్నం ముచ్చట్లు:
మచిలీపట్నం – విజయవాడ జాతీయ బైపాస్ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ద్విచక్ర వాహనదారులు దుర్మరణం పాలయ్యారు.
పామర్రు మండలం కురుమద్దాలి సమీపంలో మచిలీపట్నం నుంచి విజయవాడ వైపు ద్విచక్రంపై వెళ్తున్న ఇద్దరిని వెనుక నుంచి వచ్చిన టిప్పర్ వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారులు అక్కడికక్కడే మృతి చెందారు.
మృతులు మచిలీపట్నం సమీపంలోని ఉల్లింగిపాలెం గ్రామానికి చెందిన ఒడుగు నరేంద్ర (22), బందర్‌కోటకు చెందిన వనమూడి కుమార్ (37) గా గుర్తించారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కే. శ్రీనివాసు తెలిపారు.
Tags: Horrific road accident on the Machilipatnam-Vijayawada bypass… two dead.