July 23, 2026
Explore
మదనపల్లె బైపాస్ లో లారీ ఢీ కొట్టి యువకుడు పరిస్థితి విషమం

మదనపల్లె బైపాస్ లో లారీ ఢీ కొట్టి యువకుడు పరిస్థితి విషమం

July 23, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

మదనపల్లి మండలంలోని బైపాస్ రోడ్డులో గురువారం మధ్యాహ్నం లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి యువకుని పరిస్థితి విషమంగా మారింది. తాలూకా పోలీసుల కథనం మేరకు.. సుమారు 26 సంవత్సరాల వయసున్న గుర్తు తెలియని యువకుడు ద్విచక్ర వాహనంలో వెళుతుండగా కొండామారిపల్లె పంచాయితీ, వెన్నెల రెస్టారెంట్ వద్ద లారీ బైకును ఢీ కొట్టిందన్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిన యువకున్ని జిల్లా ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. మరన్ని వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది.

Tags: Young man in critical condition after being hit by a lorry on the Madanapalle bypass.