July 23, 2026
Explore
శ్రీ పద్మావతి బాలికల ఉన్నత పాఠశాలలో ‘నంది విద్య నటేశ్వరి’ సాంస్కృతిక కార్యక్రమం

శ్రీ పద్మావతి బాలికల ఉన్నత పాఠశాలలో ‘నంది విద్య నటేశ్వరి’ సాంస్కృతిక కార్యక్రమం

July 23, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:


తిరుపతిలోని టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహితమవుతున్న శ్రీ పద్మావతి బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం కాంచి కామకోటి పీఠాధిపతుల ఆశీస్సులతో ‘నంది విద్య నటేశ్వరి’ పేరుతో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రముఖ నృత్యకారిణి హేమమాలిని తన శిష్యబృందంతో కలిసి భారతీయ సాంప్రదాయ నృత్యాలను ప్రదర్శించి విద్యార్థినులను అలరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల్గొని అతిథులను సన్మానించి, ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థుల్లో భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పట్ల అవగాహన పెంపొందించేందుకు దోహదపడతాయని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

Tags: ‘Nandi Vidya Nateshwari’ Cultural Program at Sri Padmavathi Girls’ High School