తిరుపతి ముచ్చట్లు:
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి రూ. 78,000 విలువైన రెండు ఎయిర్ కండీషనర్ యంత్రాలను హైదరాబాద్‌కు చెందిన భక్తులు పూజ కౌశిక్, స్వాతి కౌశిక్ బుధవారం సమర్పించారు.ఈ సందర్భంగా ఆలయ ఏఈవో దేవరాజులుకు దాతలు ఏసీలను అందజేశారు. వీటిని ఆలయ పరాకామణి విభాగంలో వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
Tags: Donation of Two AC Units to Sri Padmavathi Ammavari Temple