పుంగనూరు ముచ్చట్లు:
ఏఐటియుసి రాష్ట్ర మహాసభలను ఈనెల 26న తిరుపతిలో నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ, సంఘ కార్యదర్శి వెంకట్రమణారెడ్డి లు తెలిపారు. బుధవారం స్థానిక సివిల్ సఫ్లయిస్ వద్ద మహాసభల కరపత్రాలను విడుదల చేశారు. ఈసందర్భంగా సాంబశివ మాట్లాడుతూ కార్మిక వర్గం ఎన్నడు లేని విధంగా దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని, కార్మికుల కష్టాలు లోతుగా చర్చించి భవిష్యత్తు కార్యచరణ ప్రణాళిక రూపొందించేందుకు ఏఐటియుసి 18వ రాష్ట్ర మహాసభలు ఈనెల 26 నుంచి 28వరకు తిరుపతిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మహాసభలకు ప్రతి ఒక్కరు హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పట్టణ కార్యదర్శి రామమూర్తి, రెడ్డెప్ప, పళణి, తిరుమలై, వీరమణి, విజయ్, గంగాధర్, బాలాజి, సదాశివ, సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.
Tags: Make the AITUC State Conference a Success.