పుంగనూరు ముచ్చట్లు:
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పట్టణ ఎస్‌ఐ కెవి.రమణ పేర్కొన్నారు. బుధవారం స్థానిక గోకుల్ సర్కిల్, తూర్పువెహోగసాల, బస్టాండ్ ప్రాంతాలలో వాహనాలను తనిఖీలు నిర్వహించారు. వాహనదారుల లైసెన్సు, వాహన రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ హెల్మెట్, సీటుబెల్టు వాడని వారికి , రోడ్డు భద్రతా నియమాలు పాటించని వారికి జరిమానాలు విధిస్తామన్నారు. ప్రజలకు రోడ్డు భద్రత, ప్రమదాలు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. బైక్‌లు నడిపే వారు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని , ఓవర్‌స్పీడ్, ఓవర్‌లోడ్డుతో వాహనాలు వెళ్లకూడదని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయరాదన్నారు. ప్రతి ఒక్కరు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని లేనిచో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Tags; Strict action against traffic violators.