April 22, 2026
Explore
ఓటర్ల జాబితాపై సమీక్ష

ఓటర్ల జాబితాపై సమీక్ష

April 22, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు:

ఓటర్ల జాబితా స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ పక్రియ వందశాతం పూర్తి చేసేందుకు రాజకీయ పార్టీల సహకారం అవసరమని ఎన్నికల డీటీ మోహన్‌ తెలిపారు. బుధవారం స్థానిక తహశీల్ధార్‌ కార్యాలయంలో వివిధ పార్టీల నాయకులతో కలసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోగస్‌, మరణించిన వారిని ఓటర్ల జాబితా నుంచి తొలగించి , పారదర్శకమైన ఓటరు జాబితా రూపొందించవచ్చునని తెలిపారు. సార్‌ మ్యాపింగ్‌లో 74.38 శాతం పురోగతి సాధించినట్లు ఆయన స్పష్టం చేశారు.

Tags; Review of voter list