పుంగనూరు ముచ్చట్లు:
విద్యార్థులు సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదిగి ఉన్నత స్థాయికి చేరుకోవాలని పాఠశాల విద్యాకమిటి చైర్మన్ సరస్వతి అన్నారు. బుధవారం పట్టణంలోని చింతలవీధిలో గల పురపాలక ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి విద్యార్థి జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగాలన్న లక్ష్యంతో చదువుకోవాలన్నారు. అలాగే విద్యార్థులకు పలు సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Tags: Students should grow into exemplary citizens.