మదనపల్లి ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో మదనపల్లిలో ‘మెగా కౌన్సెలింగ్ – పరివర్తన సదస్సు’ నిర్వహించారు. మహిళలపై నేరాలకు పాల్పడి శిక్ష అనుభవించిన వారిలో మార్పు తీసుకురావడం లక్ష్యంగా ఈ కార్యక్రమం జరిగింది. కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పాల్గొని నిందితులకు దిశానిర్దేశం చేశారు.
కుటుంబాల కోసం మారాలని కలెక్టర్ సూచించగా, మహిళలను వేధిస్తే పీడీ యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. నిందితుల కదలికలపై 24 గంటల నిఘా ఉంటుందని తెలిపారు.
అనంతరం నిందితుల చేత మహిళలను గౌరవిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. తాము మారి సమాజానికి మంచిగా ఉండాలని వారు హామీ ఇచ్చారు.
Tags: Mega Counseling for Habitual Offenders: A Pledge to Uphold Women’s Dignity