వీరబల్లి ముచ్చట్లు:
వీరబల్లి మండలం సానిపాయ గ్రామపంచాయతీ సచివాలయాన్ని బుధవారం తహసీల్దార్ ఖాజాభి సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. పాస్ పుస్తకాలలో పొరపాట్లు, ఫోన్ నంబర్లు, ఆధార్ వివరాలు తప్పుగా నమోదు అయిన సమస్యలను సిబ్బంది దృష్టికి తీసుకెళ్లి సరిచేసుకోవాలని సూచించారు.
అలాగే ప్రజలు తమ వివరాలను సరిచేసుకుని సమస్యలను పరిష్కరించుకోవాలని అవగాహన కల్పించారు. ప్రత్యేక అధికారి హోదాలో సచివాలయ సిబ్బంది పనితీరును పరిశీలించి వారికి పలు సూచనలు చేశారు.
Tags: Tehsildar Khajabhi visited the Sanipaya Secretariat