రాయచోటి ముచ్చట్లు:
రాయచోటి మండలం ఎగువ అబ్బవరం వద్ద కంచాలమ్మ గండి చెరువును మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పరిశీలించారు. “జలధార జల హారతి” కార్యక్రమంలో భాగంగా మాండవ్య నది నుంచి చెరువుకు వచ్చే నీటి ప్రవాహ మార్గాన్ని అధికారులు సమీక్షించారు.
మాండవ్య నదిని శుభ్రపరిచి, చెక్ డ్యాములు నిర్మించి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచాలని మంత్రి సూచించారు. చెరువుకు నీరు చేరే కాలువలో అడ్డంకులను తొలగించి నిరంతర ప్రవాహం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
చెరువు పునరుద్ధరణతో వ్యవసాయానికి, తాగునీటి సమస్యల పరిష్కారానికి దోహదం అవుతుందని తెలిపారు. సంబంధిత అధికారులు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేసి ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు.
Tags: Kanchalamma Gandi Tank Revitalized through Water Flow: Minister and Collector