April 22, 2026
Explore
ప్రపంచ స్థాయి పౌరులుగా బాలభటులు ఎదగాలి: మడితాటి

ప్రపంచ స్థాయి పౌరులుగా బాలభటులు ఎదగాలి: మడితాటి

April 22, 2026 | Andhra Pradesh

పీలేరు ముచ్చట్లు:

పీలేరు పట్టణంలోని శ్రీ భువన విద్యాలయంలో నిర్వహించిన స్కౌట్స్ అండ్ గైడ్స్ తృతీయ సోపాన్, రాజ్య పురస్కార్ శిక్షణా శిబిరాల ముగింపు సమావేశంలో అన్నమయ్య జిల్లా కార్యదర్శి మడితాటి నరసింహారెడ్డి మాట్లాడుతూ బాలభటులు ప్రపంచ స్థాయి పౌరులుగా ఎదగాలని అన్నారు. ఈనెల 18 నుంచి 22 వరకు జరిగిన శిక్షణలో తృతీయ సోపాన్‌కు 259 మంది, రాజ్య పురస్కార్‌కు 61 మంది విద్యార్థులు హాజరయ్యారు.

ప్రకృతి వైపరీత్యాల సమయంలో జాగ్రత్తలు, నైతిక విలువలు, దేశభక్తి, సేవాభావం వంటి అంశాలపై శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాల సమయంలో ప్రధమ చికిత్స అందించడం, గ్రామాల్లో స్వచ్ఛంద సేవలు చేయడం వంటి విషయాల్లో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ఈ శిక్షణ నాయకత్వ లక్షణాలను పెంపొందించి విద్యార్థులకు బంగారు భవిష్యత్తుకు దోహదపడుతుందని పేర్కొన్నారు.

Tags: Scouts Must Grow into World-Class Citizens: Madithati