April 22, 2026
Explore
మహిళా రిజర్వేషన్ బిల్లు పై అపోహలు

మహిళా రిజర్వేషన్ బిల్లు పై అపోహలు

April 22, 2026 | Andhra Pradesh

2023 లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టం అయింది

అయితే అందులో 2027 జనాభా గణన తర్వాత అమలు చేయాలి అనే నిబంధన ఉంది

అందువల్లనే ఇప్పుటి వరకు అమలు కాలేదు

నిబంధన తొలగించి రాజ్యాంగ సవరణ చేస్తే వెంటనే అమలుచే చేయవచ్చు

ఇప్పుడు జరుగుతుంది రాజకీయ డ్రామా

అమరావతిముచ్చట్లు:

పార్లమెంట్‌లో జరిగిన ప్రత్యేక సెషన్ ఒక రాజకీయ సంచలనం. మూడు బిల్లులు ప్రవేశపెట్టి, ఒకటి ఓటింగ్‌లో విఫలమైతే మిగతా రెండింటిని ఉపసంహరించుకోవడం. ఇది మహిళా రిజర్వేషన్ అంశాన్ని మళ్లీ హైలైట్ చేసింది. బీజేపీ “మహిళా రిజర్వేషన్ విరిగిపోయింది” అని ప్రచారం చేస్తుండగా ప్రతిపక్షాలు “బీజేపీ డిలిమిటేషన్ ద్వారా రాజకీయ లాభం కోసం గేమ్ ఆడుతోంది” అంటున్నాయి.

మహిళా రిజర్వేషన్ బిల్లు (Nari Shakti Vandan Adhiniyam – 2023) సెప్టెంబర్ 2023లో లోక్‌సభ, రాజ్యసభలో దాదాపు ఏకగ్రీవంగా(ప్రతిపక్షాలు సహా కాంగ్రెస్, డీఎంకే, తదితరులు మద్దతు) పాస్ అయింది. 33% రిజర్వేషన్ కు చట్టబద్దత ఏర్పడింది. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలు, ఢిల్లీ అసెంబ్లీలో మహిళలకు ఒక్కొక్క సీటు మూడింట ఒక వంతు రిజర్వ్ అయ్యింది. కానీ ఒక కీలక నిబంధనను లోపాయికారీగా పొందుపరిచారు. Article 334A ప్రకారం ఈ రిజర్వేషన్ 2026 తర్వాత జరిగే మొదటి జనాభా గణన ఆధారంగా డిలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) పూర్తయిన తర్వాతే అమలవుతుందని. అంటే 2027 జనాభా గణన మరియు డిలిమిటేషన్ తర్వాత అమలు జరిగా అవకాశం ఉంది. ఆర్టికల్ 334ఏ సవరణ చేసి ఉన్నట్లయితే ఈపాటికే అమలులోకి వచ్చేది. కానీ కేంద్ర ప్రభుత్వం ఆ పని చేయలేదు. దానివల్ల మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పటికీ అమలు జరగకుండా నిలిచిపోయింది.

ఏప్రిల్ 2026లో ప్రవేశపెట్టిన మూడు బిల్లులు ఏమిటి?

ఏప్రిల్ 16న ప్రభుత్వం మూడు బిల్లులు ప్రవేశపెట్టింది. ఒకటి 131వ రాజ్యాంగ సవరణ బిల్లు. రెండవది డిలిమిటేషన్ బిల్లు, మూడవది యూటీ లాస్ అమెండ్‌మెంట్ బిల్లు.
ఏప్రిల్ 17న లోక్‌సభలో 131వ సవరణ బిల్లుపై ఓటింగ్ జరిగి 298 అనుకూల, 230 వ్యతిరేక ఓట్లు వచ్చాయి. 2/3 మెజారిటీ (సుమారు 352 ఓట్లు) కావాల్సి ఉండగా రాలేదు. దాంతో బిల్లు విఫలమైంది, కానీ మిగతా రెండు బిల్లులను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. సెషన్ వాయిదా పడింది.

బీజేపీ వాదన

2023 బిల్లును అమలు చేయాలంటే డిలిమిటేషన్ అవసరం. ఇప్పుడు 2011 డేటాతో వేగవంతం చేస్తే 2029 నుంచి మహిళలకు రిజర్వేషన్ వస్తుంది. ప్రతిపక్షాలు (INDIA కూటమి) దీన్ని అడ్డుకుని మహిళలను మోసం చేశాయి. ప్రధాని మోదీ దేశానికి చెప్పిన ప్రసంగంలో మహిళలకు క్షమాపణ చెప్పారు. వాస్తవానికి 2023 లోని చట్టంగా ఆమోదించబడిన మహిళా బిల్లును డీల్ మెడిటేషన్ తో ముడి పెట్టకుండా ఉండి ఉంటే ఈపాటికే మహిళలకు రిజర్వేషన్ అమలులోకి వచ్చి ఉండేది. దానికి మహిళలకు ప్రధానమంత్రి క్షమాపణ చెప్పటం సరి అయినదే.

ప్రతిపక్షాల వాదన

డిలిమిటేషన్ దక్షిణ రాష్ట్రాల (ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ) సీట్లు తగ్గిస్తుంది. కొత్త జనాభా గణన మరియు కుల గణన తర్వాత డిలిమిటేషన్ చేయాలి. 2023 బిల్లులోనే లింక్ పెట్టి బీజేపీ ఆలస్యం చేసింది, ఇప్పుడు 2011 డేటాతో ఉత్తర ఆధిపత్యం కోసం ప్రయత్నం చేస్తుంది.

ప్రస్తుత స్థితి

2023 చట్టం అమలులో ఉంది, కానీ రిజర్వేషన్ ఇంకా అమలు కాలేదు. తదుపరి జనాభా గణన తర్వాత డిలిమిటేషన్ జరిగితేనే అమలు. ఉత్తర-దక్షిణ విభజన, 2029 ఎన్నికలు వంటి అంశాలు ఇంకా రాజకీయంగా ముడిపడి ఉన్నాయి. ఈ అంశం మహిళా సాధికారత కంటే రాజకీయ సమతుల్యం మీద ఆధారపడింది. వాస్తవాలు చూస్తే, రెండు పక్షాలూ తమ వాదనలు చెప్పుకోవచ్చు కానీ మహిళల రాజకీయ ప్రాతినిధ్యం ఇంకా ఆలస్యమవుతోంది.

Tags;Misconceptions Regarding the Women’s Reservation Bill