అమరావతిముచ్చట్లు:
ఈ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని భాష్యం పాఠశాల విద్యార్థులు సందర్శించారు. కలెక్టర్ కార్యాలయంలో జరుగుతున్న పనితీరును తెలుసుకోవాలనే ఉద్దేశంతో వచ్చిన విద్యార్థులను జిల్లా కలెక్టర్ ఆత్మీయంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయ విభాగాల పనితీరు, ప్రజల నుంచి వచ్చే వినతులు, ఫిర్యాదులను స్వీకరించడం మరియు వాటి పరిష్కార ప్రక్రియ గురించి విద్యార్థులకు వివరించారు. అలాగే, రెవెన్యూ, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు విధానం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.పరిపాలనా వ్యవస్థ గురించి వివరణాత్మకంగా వివరించారు.విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ, ప్రభుత్వ సేవలలో పారదర్శకత, బాధ్యతాయుత వైఖరి ఎంత ముఖ్యమో కలెక్టర్ గారు వివరించారు. అదనంగా, విద్యార్థులు తమ చదువులో కృషి చేసి, భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు.అనంతరం విద్యార్థులు కలెక్టర్ కార్యాలయంలోని వివిధ విభాగాలను పరిశీలించి, రోజువారీ పరిపాలనా పనితీరును ప్రత్యక్షంగా గమనించారు. ఈ సందర్శన ద్వారా వారికి ప్రభుత్వ వ్యవస్థపై విస్తృతమైన అవగాహన ఏర్పడింది.
Tags:District Collector Kritika Shukla with students